60 మంది విద్యార్థులకు అస్వస్థత

Telugu Lo Computer
0


కేరళలోని వయనాడ్‌ జిల్లాలోని లక్కిడి ప్రాంతంలో గల జవహర్‌ నవోదయా విద్యాలయంలో సుమారు 486 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో అందించిన ఆహారం తిన్నాకా అందులోని 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఫుడ్‌ పాయిజన్‌కు గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు ఒకేసారి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)