భువనేశ్వర్ లో జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ 'షూటౌట్'లో 5-4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి 'షూటౌట్' నిర్వహించారు. 'షూటౌట్'లో నిర్ణీత ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. 'సడెన్ డెత్'లో తొలి షాట్‌లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్‌లో జర్మనీ సఫలం కాగా, బెల్జియం ఆటగాడు విఫలం కావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. జర్మనీ 2002, 2006ల లో టైటిల్ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3-1తో ఆస్ట్రేలియాను ఓడించింది.
ప్రపంచకప్ హాకీ టోర్నీ విజేత జర్మనీ
January 30, 2023
0
Tags