ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ - 2023 జరగనుందని చిన్న జీయర్ స్వామి ప్రకటించారు. ఈమేరకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఫిబ్రవరి రెండు నుంచి పన్నెండు వరకు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ముచ్చింతల్‌లో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గతేడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైందని. 216 అడుగుల పంచలోహ విగ్రహం లోకానికి అందుబాటులోకి వచ్చిందన్నారు. “సమతా మూర్తి కేంద్రం ప్రారంభమై ఏడాది పూర్తి అవుతుంది. 108 దివ్య ప్రదేశాలు సమతా మూర్తి కేంద్రంలో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కోట్లాది మంది సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను తిలకించారు. ఫిబ్రవరి 2 న మొదటి వార్షికోత్సవం జరపబోతున్నాం. నిరుడు లాగే అదే స్థాయిలో వేడుక సాగుతుంది. 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నాం. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాం” అని చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు 'సమతా కుంభ్'
January 30, 2023
0
Tags