కర్ణాటకలోని మంగుళూరు, సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ ఈవెంట్ కు సంబంధించి నలుగురు విద్యార్థులు బురఖాలు ధరించి డ్యాన్స్ చేశారు. బురఖాలు ధరించి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. వీరి డ్యాన్స్ కు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలేజీ ప్రిన్సిపల్ చర్యలకు ఆదేశించారు. విద్యార్థులను సస్పెండ్ చేసి, వివరణతో కూడిన సమాధానం ఇవ్వాలని ప్రిన్సిపల్ ఆదేశించారు. ఈ వీడియో చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు బురఖాలు ధరించి డ్యాన్స్ చేయడం.. ప్రజల మధ్య మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే కళాశాల యాజమాన్యం ఏం చేస్తోందని మండిపడుతున్నారు.
బురఖాలతో డ్యాన్స్ చేసిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు
December 09, 2022
0
Tags