మధ్యప్రదేశ్‌లో బైతుల్ జిల్లాలో బోరు బావిలో పడిన బాలుడు మృతి చెందాడు. దాదాపు నాలుగు రోజుల పాటు అధికారులు చేసిన సహాయక చర్యలు ఏవీ ఫలించలేదు. ఈరోజు తెల్లవారుజామున బాలుడి డెడ్‌బాడీని వెలికితీశారు అధికారులు. దీంతో బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెస్క్యూ ఆపరేషన్ నాలుగు రోజుల పాటు కొనసాగడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఓ అధికారి కొడుకు అయి ఉంటే ఇలానే చేసే వారా అంటూ ప్రశ్నలు సంధించారు. బైతుల్ జిల్లా మండి గ్రామానికి చెందిన తన్మయ్...ఈ నెల 6న సాయంత్రం పొలంలో ఆడుకుంటూ పక్కనే ఉన్న 55 ఫీట్ల బోరు బావిలో పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న తన్మయ్ సోదరి..తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు బాలుడు బావిలో పడిన గంట తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బాలుడికి ఊపిరి అందేలా ఆక్సిజన్ పైపులు పంపించారు. బాలుడి చేతికి తాడు కట్టి పైకి లాగే ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలం కాలేదు.
బోరు బావిలో పడిన బాలుడు మృతి !
December 10, 2022
0
Tags