
దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నోయిడాలో బస్సు-కంటెయినర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 10 మందికి గాయపడ్డారు.పొగమంచు వల్ల బస్సు-కంటెయినర్ ఢీకొన్నాయి.ప్రమాదం జరిగిన బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.10 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు గౌతంనగర్ పోలీసులు తెలిపారు. ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలను పొగమంచు దట్టంగా కమ్ముకున్నందు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ మంగళవారం అలర్ట్ జారీ చేసింది.