కర్ణాటకలోని సంపిగేహళ్లికి చెందిన ఒక మహిళకు 2011లో ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. వీళ్లిద్దరూ టెక్కీలే. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. అయితే.. ఆ తర్వాత భర్త డ్రగ్స్‌కి, మద్యానికి బానిసయ్యాడు. అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని అతడు బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో దాడి చేశాడు. ఆ దెబ్బలు భరించలేక ఆమె ఒప్పుకుంది. అతని ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొంది. దీనిని అతడు వీడియో కూడా తీశాడు. పదే పదే తన స్నేహితులకి పడక సుఖం అందించాలని వేధించసాగాడు. రానురాను అతని వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. కానీ, అతడు మాత్రం ఆ శృంగార వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడు. విడాకులకు అప్లై చేస్ ఆ వీడియోల్ని లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. తన సోదరితోనూ భర్త లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తూ వచ్చాడని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. గంజాయికి అలవాటు పడ్డ తన భర్త, ఇంట్లోనే రెండు మొక్కలు పెంచాడని కూడా తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, అతడ్ని అరెస్ట్ చేశారు.
వేధింపులు తాళలేక భర్తపై పోలీస్ కేసు
December 10, 2022
0
Tags