ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. చొక్కాని దీపోత్సవంలో మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. భారీగా భక్తులు తరలిరావడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు ఆలయ సిబ్బంది, ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ఓ మహిళా సెక్యూరిటీ గార్డుకు చెయ్యి విరిగింది. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏటా కార్తీక పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భారీ దీపోత్సవం ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయ పరిసరాల్లోనే దాదాపు ఒక 20 అడుగుల ఎత్తులో ఒక దీపాన్ని ఏర్పాటు చేశారు. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీపోత్సవం నిర్వహించారు. ఈ దీపోత్సవానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. చుట్టూ భక్తులు కూర్చుని ఉండగానే.. దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ మంటలు భక్తులపై పడ్డాయి. దీంతో భయాకంపితులైన భక్తులు మంటలకు భయపడి ఒక్కసారిగా పరుగు అందుకున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
శ్రీకాళహస్తి చొక్కాని ఉత్సవాల్లో అపశృతి
December 07, 2022
0
Tags