ఉత్తర ప్రదేశ్ పీలీభీత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్కు, సీమాదేవి (30)కి 7 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయినప్పటి నుంచి రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటి వారు తనను వేధిస్తున్నారని సీమాదేవి తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి ఇంట్లో మహిళ వంట చేసింది. తర్వాత ఆమె తన భర్తకు ఒక ప్లేట్లో ఆహారం వడ్డించింది.అయితే ఆమె భర్తకు ఆ ప్లేట్లో తల వెంట్రుక కనిపించింది. దీంతో కోపం తెచ్చుకున్న అతడు.. తన భార్యకు గుండు కొట్టించాడు. ఘటన అనంతరం వివాహిత ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత నుంచి అందిన కంప్లైంట్ ఆధారంగా.. నిందితులపై వరకట్న చట్టంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ భర్తను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసు అధికారి సతీష్ శుక్లా చెప్పారు.
భార్యకు గుండు కొట్టించిన భర్త !
December 11, 2022
0
Tags