పాఠశాల బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి

Telugu Lo Computer
0


ముంబైలోని చెంబూర్‌లో గల ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ముంబై-పుణె హైవేపై రాత్రి 8 గంటల ప్రాంతంలో కొండలు దిగుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే లోనావాలా, కోపోలి తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)