ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో విశ్వహిందూ పరిషత్ తమ కార్యకర్తలకు అధికారికంగా కత్తులు, కర్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. సారనాథ్ జిల్లాలోని లోహియానగర్‌కు సమీపంలోని బాల్ ఉపాసన కేంద్రంలో తమ కార్యకర్తలకు కుంగ్ ఫూ నేర్పిస్తానని, కర్రలు,కత్తులను పంపిణీ చేస్తానని వీహెచ్‌పీ కాశీ మహానగర్ జాయింట్ జనరల్ సెక్రటరీ సంజయ్ హిందూ సిన్హా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ''వీహెచ్‌పీ కార్యకర్తలకు 15 రోజుల పాటు లాఠీ తిప్పడంలో, నెలపాటు కత్తి తిప్పటంలో, మూడు నెలల పాటు కుంగ్ ఫూలో ఉచితంగా శిక్షణ ఇచ్చి లైసెన్సుతో కత్తులు, కర్రలు ఉచితంగా ఇస్తాం'' అని పోస్టు చేశారు.ఆశాపూర్ లోని లోహియా నగర్ బాల్ ఉపాసన శిక్షణకేంద్రంలో 100 డాలర్లతో సభ్వత్వానికి త్వరపడాలని కోరడం విశేషం. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ కావడంతో అనంతరం దాన్ని తొలగించారు.
వీహెచ్‌పీ కార్యకర్తలకు కత్తులు, కర్రల పంపిణీ ?
December 06, 2022
0
Tags