ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అనారోగ్య సమస్యతో అపోలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10.20 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శన నిర్మాత విజయబాపినీడు మూడవ కూతుర్ని జనార్ధన్ పెళ్లిచేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత. చిన్నతనంలోనే మరణించగా, రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్. అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. జనార్ధన్ మృతితో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి.
వల్లభనేని జనార్ధన్ కన్నుమూత
December 29, 2022
0