భూమికి అత్యంత సమీపంగా జెమినిడ్స్‌ ఉల్కాపాతం

Telugu Lo Computer
0


ఈరోజు రాత్రి జెమినిడ్స్‌ ఉల్కాపాతం భూమికి అత్యంత సమీపంగా రానుంది. టెలిస్కోప్‌ అవసరం లేకుండానే చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో జెబినిడ్స్ ఉల్కాపాతం చివరిది. డిసెంబర్ 4వ తేదీ నుంచి ఆకాశంలో కనిపిస్తున్న 'జెమినిడ్స్‌' ఉల్కాపాతం బుధవారం రాత్రి గరిష్ఠస్థాయికి చేరుకోనుంది. గరిష్ఠంగా గంటకు 150 ఉల్కలతో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇది అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. జెమినిడ్స్‌ ఉల్కాపాతం శిథిలాలు సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించే సందర్భంలో మండిపోతూ ప్రకాశంగా కనిపించి కనువిందు చేయనున్నాయి. వీటిని టెలిస్కోప్‌ లేకుండానే వీక్షించే అవకాశం ఉందని, భూమిమీద ఎక్కడినుంచైనా చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని ప్రత్యక్షంగా చూసినా ఎటువంటి ప్రమాదం ఉండదని కాబట్టి ఈ అదర్భుతాన్ని ప్రజలు అంతా చూసి ఆనందించవచ్చని సూచిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఉల్కాపాతం గరిష్ఠ స్థాయిని చేరుకొంటుందని..రాత్రి 9 గంటలకు దీన్ని మరింత స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆకాశంలో ఈ మహాద్భుతాన్ని వీక్షించే అవకాశాన్ని ఎవరూ మిస్‌ కావద్దని ఖగోళనిపుణులు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)