కూతురును చంపిన టెక్కీ !

Telugu Lo Computer
0


గుజరాత్‌కు చెందిన రాహుల్ భార్యాపిల్లలతో కలిసి బెంగళూరులో వుంటున్నాడు. ఆరు నెలల క్రితం రాహుల్‌కు ఉద్యోగం పోయింది. ఇటు బిట్ కాయిన్ బిజినెస్ లోనూ నష్టమొచ్చింది. దీంతో అప్పులపాలైన రాహుల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. మూడు రోజుల క్రితం కూతురుతో కలిసి బయటకు వెళ్లిన రాహుల్.. తిరిగి రాలేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఆపై సిటీ శివార్లలోని ఓ చెరువు దగ్గర రాహుల్ కారు కనిపించింది. ఆ చెరువులో రాహుల్ కూతురు మృతదేహం బయటపడింది. విచారణలో రాహుల్ తన కూతురును చంపేసినట్లు తేలింది. డబ్బులేకపోవడంతో కూతురుకు తిండిపెట్టలేనని భావించి హత్యకు పాల్పడినట్లు రాహుల్ చెప్పినట్లు పోలీసులు వివరించారు. తనూ ఆత్మహత్యకు ప్రయత్నించినా విఫలమైనట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)