అప్పు తీర్చేందుకు కబాబ్‌లు అమ్ముతున్నాడు !

Telugu Lo Computer
0


చైనాకు చెందిన తాంగ్జియాంగ్ రెస్టారెంట్​తో వ్యాపారం మొదలు పెట్టిన అంచెలంచెలుగా ఎదిగాడు. తన 36 ఏండ్ల వయసునాటికి రెస్టారెంట్లను విస్తరించి మిలియనీర్​గా మారాడు. 2005 లో ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాడు. అంతే, అతని జీవితం రివర్స్ అయింది. పెట్టుబడికి రెట్టింపు లాస్ వచ్చింది. ఆస్తులన్నీ అమ్మి కట్టినా అప్పు తీరలే. రూ.52 కోట్ల అప్పుతో వీధిన పడ్డాడు. ఇక మిగిలిన అప్పులు ఎలాగైనా తీర్చేందుకు తూర్పు చైనా నగరమైన హాంగ్‌జౌలో మళ్లీ చిన్న హోటల్ ప్రారంభించాడు. తానే స్వయంగా కబాబ్​లు కాలుస్తూ అమ్మడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన డబ్బుతో అప్పులు కట్టి తన వ్యాపారాన్ని తిరిగి నిర్మిస్తానని చెప్తున్నాడు. మళ్లీ రోడ్డున పడిన అతని లైఫ్​ జర్నీ ప్రస్తుతం ఆ దేశంలో వైరల్ అవుతోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)