భార్య తనతో వచ్చేందుకు నిరాకరించడంతో కత్తితో దాడి !

Telugu Lo Computer
0


రాజస్తాన్‌ లోని ధోలపూర్‌లో భార్య తనతో వచ్చేందుకు నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో దాడి చేసి పారిపోయాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకాం ఈ జంట ఇంటి నుంచి పారిపోయి  పెళ్లి చేసుకుసుని బారీ అనే పట్టణంలో నివసిస్తున్నారు. అయితే జైపూర్‌లో ఉంటున్న భర్త కుటుంబ సభ్యులు ఆ మహిళతో సహా తిరిగి ఇంటికి వచ్చేయమని బలవంతం చేశారు. ఈ నేఫథ్యంలోనే దంపతులు రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. కానీ ఆమె అతడి కుటుంబసభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తనతో వచ్చేందుకు ఒప్పుకోవడం లేదన్న కోపంతో ఆమె భర్త  కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమె తాను చనిపోతానన్న భయంతో బెంచ్‌ మీద రక్తంతో తల్లిదండ్రుల మొబైల్‌ నెంబర్లను రాసింది. ఆ తర్వాత ఆమె ఒక జీఆర్‌పీ జవాన్‌ సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)