వృద్ధుడి పొట్టలో గ్లాసు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లాలో ఓ వృద్ధుడు తనకు తీవ్రంగా కడుపు నొప్పి వస్తోందంటూ జిల్లా ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు అతని పొట్టలో గ్లాసు ఉండడంతో షాక్‌కు గురయ్యారు. నాలుగు నెలల క్రితం అమావత్‌ గ్రామానికి వెళ్లిన రామ్‌దాస్‌ అనే వృద్ధుడిని కొందరు దారుణంగా కొట్టారు. అనంతరం ఓ గ్లాసుపై కూర్చోబెట్టారు. దీంతో గ్లాసు అతని పొట్టలోకి వెళ్లిపోయింది. గ్రామస్థులు ఈ అమానవీయ చర్యను చూసినప్పటికీ ఎలాంటి సహాయం చేయలేకపోయారు. ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా రాందాస్‌ సిగ్గుతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పి ఎక్కువ కావడంతో చతుఖేడ చేరుకుని గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్థులు అతడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు పొట్టలో గ్లాసు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీస్తామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)