ఉత్తరాఖండ్‌లో పెళ్లి బృందం బస్సు బోల్తా

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌లో పెళ్లి బృందంతో పెళుతున్న బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మృత్యువాపడ్డారు. హరిద్వార్ నుంచి పౌరీ జిల్లాలోని బీర్ఖల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ బస్సు అదుపుతప్పి రోడ్డు బ్యారియర్లను దాటుకుని చెట్టును ఢీకొట్టి లోయలోపడింది. రాత్రిపూట ఈ ప్రమాదం జరగడంతో చీకట్లో సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ ప్రమాదం వార్త తెలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన బస్సు హరిద్వార్ జిల్లా నుంచి పౌరి జిల్లాలోని బీర్ఖల్ బ్లాకుకు వెళుతుండగా, రిఖ్నింఖల్ బిరోంఖల్ మోటార్ రోడ్డు సమీపంలో సిమ్ది గ్రామంలో బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతైన నాయర్ నది లోయలోకి దూసుకెళ్ళింది. ప్రమాద స్థలంలోనే 25 మంది భావిస్తున్నారు. అయితే, ప్రమాద స్థలంలో ఉన్న అధికారులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడంలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)