విరిగిపడిన కొండచరియలు ఘటనలో నలుగురు మృతి

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌ లో  భారీవర్షాలకు కొండచరియలు విరిపిపడుతున్నాయ. శనివారం ఉదయం చమోలీ జిల్లాలోని తరాలి ప్రాంతంలో మూడు ఇళ్లపై కొండచరియలు  విరిగిపడడంతో నలుగురు మృత్యువాత పడగా, ఒకరు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల నుంచి 12ఏళ్ల బాలికను సురక్షితంగా బయటకు తీశారు అధికారులు. సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తరాలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రవీంద్ర జువంత తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. ఒకే ఫ్యామిలిలోని నలుగురు మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)