మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

Telugu Lo Computer
0


గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకు ముందు మహత్మాగాంధీ రోడ్డులోని బాపూజీ విగ్రహం వద్ద పలువురు మంత్రులతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధ్యానభంగిమలో కూర్చున్న మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని సర్కారు రూ.1.25కోట్లు గాంధీ ఆస్పత్రి ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది. 16 అడుగుల ఎత్తుతో, 5టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్‌ సుతార్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారితో కలిసి హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)