మామ మర్మాంగం కోసిన కోడలు

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లోని మైనాలోని తూర్పు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శిఖా అనే మహిళకు వివాహం అయింది. భర్త, అత్తమామలతో కలిసి ఉంటుంది. శిఖాకి పుట్టింటిపై ఎన్నలేని ప్రేమ. అక్కడ గడిపేందుకు, వారితో కలిసి ఉండే సుఖం కోసం ఆమె ఎప్పుడూ ఎదురు చూస్తునే ఉంటుంది. అందుకే శిఖా తన పుట్టింటి వారితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండేది. దీంతో ఆమె పై అత్తమామలు , భర్త అనుమానం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక రోజు శిఖాకి ఆమె తండ్రి ఫోన్ చేసి ఇంట్లో మాంసాహారం వండామని తిన్నడానికి రమ్మని పిలిచాడు. దీంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెళ్లొద్దని, తానే చికెన్ తెస్తానని ఇంట్లోనే వండుకుని తిందామని భర్త తెలిపాడు. ఫోన్ మాట్లాడిన అనంతరం ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. తన అత్తమామలతో వాగ్వాదానికి దిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన కోడలు విచక్షణ కోల్పోయి అత్తమామలపై దాడి చేసింది. అక్కడే ఉన్న కత్తితో తన మామ మర్మాంగాన్ని కోసి పడేసింది. దీంతో అతడు పెద్ద ఎత్తున కేకలు వేశాడు. ఆ అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు నొప్పితో విల విలలాడుతున్న అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. భర్త వచ్చే వరకు పారిపోకుండా సదరు మహిళను బంధించగా, తప్పించుకుని పుట్టింటికి పారిపోయింది. అనంతరం బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం విచారణ జరిపి.. ఆమెకు 14 రోజుల కస్టడీ విధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)