ఇండోనేషియన్ ఫుట్‌బాల్ లీగ్ శనివారం రాత్రి ఈస్ట్ జావాలోని మలాన్ రెగెన్సీలో ఉన్న స్టేడియంలో ఘనంగా జరిగింది. చిరకాల ప్రత్యర్థులైన పెర్సెబాయ సురబాయ, అరెమా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అరెమా జట్టు ఓటమిపాలయ్యింది. దానితో సొంత స్టేడియంలో ప్రత్యర్థి చేతిలో తమ జట్టు ఓడిపోవడం చూసి ఫుట్ బాల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలోకి దూసుకుపోయి రచ్చ రచ్చ చేశారు. దానితో పెర్సెబాయ జట్టు అభిమానులు సురబాయ జట్టు అభిమానులపై దాడికి పాల్పడ్డారు. దీనితో ఇరుజట్ల ఫ్యాన్స్ మధ్య తీవ్ర తోపులాట ఘర్షణ చోటుచేసుకుంది. ఇది గమనించిన పోలీసులు రంగంలోకి దిగి మైదానంలో ఉన్న క్రీడా అభిమానులపై లాఠీలు ఝులిపించారు. ఘర్షణను అదుపుచేసేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 34 మంది అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 300 మంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. మరికొంత మంది చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మొత్తంగా దాదాపు 127 మంది ఈ తొక్కిసలాటలో మరణించారని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘోర దుర్ఘటనపై ఇండోనేషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దర్యాప్తుకు ఆదేశించింది.
ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్ ఘర్షణలో 127 మృతి
October 02, 2022
0
Tags