తారిఖ్ ఖాన్ అనే వ్యక్తి.. లింకెడ్‌ఇన్‌లో ఈమధ్య ఓ పోస్ట్ షేర్ చేశారు. ఎలివేటర్‌లో ఉండగా ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఆయన దృష్టిని ఆకర్షించారట. అతని కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా కనిపించాడట. ఎందుకలా వచ్చావ్? అని అడిగితే దారిలో చిన్నయాక్సిడెంట్ అయ్యిందని, చెప్పులు ఎక్కడో పడిపోయాయని, పైగా కాలికి గాయంతో వాపు వచ్చిందని, అందుకే వేసుకోలేదని చెప్పాడు ఆ డెలివరీబాయ్. అలాంటప్పుడు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అతనికి సూచించాడు తారిఖ్. దానికి అతను నవ్వుతూ.. 'నాకంటూ ఓ కుటుంబం ఉంది సార్. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా'' అంటూ లిఫ్ట్ బయటకు వెళ్లిపోయాడు. పోతూ పోతూ మర్యాదపూర్వకంగా శుభసాయంత్రం సార్ అని చెప్పివెళ్లిపోయాడు అని తారిఖ్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి, అవసరమైన వేళలో నన్ను నేను ముందుకు వెళ్లడానికి ఇతనిలాంటి వ్యక్తులే నాకు స్ఫూర్తి అంటూ తారిఖ్ ఖాన్ లింకెడ్‌ఇన్‌లో ఆ పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు అతనికి సాయం కూడా అందించాడు.
యాక్సిడెంట్ అయినా ఫుడ్ డెలివరీ ఆపలేదు
September 30, 2022
0