జీవిత భీమా సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విద్యాధన్ స్కాలర్‌షిప్ పేరుతో స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. విద్యాధన్ స్కాలర్‌షిప్ ఇంటర్ ఫస్టియర్ , డిగ్రీ ఫస్టియర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులకు అందిస్తారు. అభ్యర్థులు ముందు తరగతిలో కచ్చితంగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,60,000 మించకుండా ఉండాలి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందజేస్తారు. డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 చొప్పున మూడేళ్లు అందజేస్తారు. ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున రెండేళ్లు అందజేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 దరఖాస్తులకు చివరితేది.అర్హత కలిగిన వారు ఎల్‌ఐసీ అధికార వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎల్ఐసీ విద్యాధన్ స్కాలర్‌షిప్ !
July 17, 2022
0
Tags