విస్సన్నపేటలో పెద్ద పులి సంచారం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న అటవీ ప్రాంతాల్లో పది రోజుల నుంచి సంచరిస్తున్న పెద్ద పులి తొలిసారి అటవీ శాఖ అధికారులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాకు చిక్కింది. బుధవారం మధ్యాహ్నం కశింకోట మండలం విస్సన్నపేట కొండ ప్రాంతంలో గేదె పెయ్యిని చంపేసిన ప్రదేశానికి చుట్టుపక్కల అటవీ అధికారులు నాలుగు ట్రాక్‌ కెమెరాలను ఏర్పాటుచేశారు. గేదె పెయ్యి కళేబరాన్ని అక్కడే ఉంచారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పెద్ద పులి అదే ప్రదేశానికి వచ్చింది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలను అధికారులు శుక్రవారం పరిశీలించారు. శనివారం బోన్లు రప్పించి పలుచోట్ల అమరుస్తామని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)