సప్లిమెంటరీలో పాస్‌ అయినా రెగ్యులర్‌గానే పరిగణిస్తాము !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రచ్చగా మారిన పదో తరగతి ఫలితాలపై తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సత్యసాయి పుట్టపర్తిలో జిల్లాలో పర్యటించిన జగన్ ఖరీప్ సాగుకు సంబంధించిన రైతుల బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విపక్షాలను టార్గెట్ చేసిన జగన్ పదవి తరగతి ఫలితాలపైనా మాట్లాడారు. కొన్ని పార్టీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మసైర్ధం నింపాల్సింది పోయి, వాళ్లు ఆత్మహత్యలు చేసుకునేలా కుట్రలు చేశారని ఆరోపించారు. పదవ తరగతిలో 67 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని సీఎం జగన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ ఎస్సెస్సీలో 65 శాతం మందే ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. కాని ఇక్కడి విపక్షాలు మాత్రం రాద్ధాంతం చేశాయని ధ్వజమెత్తారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు పదో తరగతి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దని, నెల రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సప్లిమెంటరీలో పాస్‌ అయినా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని ప్రకటించారు. సప్లిమెంటరీలో పాస్ అయినవాళ్లు మొదట పాస్ అయిన వాళ్లతో కలిసి ఇంటర్ చేసుకోవచ్చని సీఎం జగన్ వరమిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)