రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ధన్ మండీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టైలర్‌ను ఇద్దరు దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. టైలర్ షాపులోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఒక దుండగుడు కన్హయ్య లాల్ పై కత్తితో దాడి చేయగా మరో దుండగుడు ఆ ఘటనను తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. పదునైన కత్తితో తల నరకడంతో టైలర్ స్పాట్ లోనే చనిపోయాడు. తర్వాత ఇద్దరు దుండగులు తామే హత్య చేశామంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య జరిగిన పోస్టుల వివాదంతోనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. టైలర్ హత్య ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కన్హయ్య లాల్ హత్యతో ఉదయ్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. షాపులన్ని మూతపడ్డాయి. జనాలు రోడ్డు మీదకు రావాలంటేనే జంకుతున్నారు. దుండగులను అరెస్ట్ చేయాలంటూ స్థానిక వ్యాపారులు ధర్నాకు దిగడంతో మంగళవారం రాత్రి ఉద్రిక్తత తలెత్తింది. ఉదయ్ పూర్ లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజస్థాన్ లో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన టైలర్ హత్య !
June 29, 2022
0
Tags