అమెరికాలో వింతజీవి సంచారం ?

Telugu Lo Computer
0


అమెరికా లోని టెక్సాస్‌లోని జంతు ప్రదర్శనశాల వెలుపల దాగి ఉన్న వింత అనిశ్చిత జీవి చిత్రం వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. సమీపంలోని సీసీ కెమెరా ద్వారా ఈ వింత జీవి చిత్రాలు బయటకు వచ్చాయి. జూలో ఆ జీవి తిరుగుతున్నట్లు కనపడింది. దానికి రెండు చెవులు ఉన్నాయని, రెండు కాళ్లతో నడుస్తోందని వీడియో చూసిన వారికి తెలుస్తోంది. టెక్సాస్‌లోని అమరిల్లో నగరానికి చెందిన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వింత జీవికి సంబంధించిన ఫొటో పోస్ట్ చేశారు. మే 21న తెల్లవారుజామున జూ వెలుపల ఒక వింత జీవి సంచరించింది. అదేమిటో తెలిస్తే చెప్పాలని కోరింది. ఈ సమయంలో ఎటువంటి వ్యక్తులు లేదా జంతువులకు హాని జరగలేదని పార్క్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేదా ఏ విధమైన నేర కార్యకలాపాలు కూడా లేవని తేలింది. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ ప్రకారం, చిత్రం మే 21, తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో అది సంచరించిందని తెలిసింది. జూ అధికారులు ఈ సంఘటనపై ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఏదైనా తెలిస్తే మెయిల్ చేయాలని కోరారు. ఏదేమైనా ఈ చిత్రం బయటకు రాగానే అది ఏలియన్ అయి ఉంటుందనే ఊహాగానాలు చుట్టు ముట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం బాగా వైరల్ అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)