నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు జిల్లాల పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పలు జిల్లాలలో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న తొలి మహానాడుతో చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ విధ్వంసకర పాలనను ఎండగడుతూ ప్రజల భవిష్యత్‌కు భరోసా కల్పించేలా చంద్రబాబు జిల్లాల పర్యటన ఉంటుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రతి జిల్లాల్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో తొలి రోజు మహానాడు, రెండో రోజు పార్లమెంటు పరిధిలోని నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. మూడో రోజు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇలా ఏడాది పాటు చంద్రబాబు 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అటు జిల్లాల పర్యటనలు, ఇటు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా చంద్రబాబు షెడ్యూల్‌ను టీడీపీ నేతలు రూపొందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)