వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


తెలంగాణ లోని  వరంగల్ చౌరస్తాలో శుక్రవారం తెల్లవారుజామున మను ఫ్యామిలీ రెస్టారెంట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రెస్టారెంట్ కి ముందు క్లాత్ తో చేసిన డెకరేషన్ కు మొదట మంటలు అంటుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీనితో రెస్టారెంట్ లోని ఫర్నిచర్ మొత్తం దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన రెస్టారెంట్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మను రెస్టారెంట్ కింద ఫ్లోర్ లో మరో రెండు షాపులు ఉండటంతో వాటికి కూడా మంటలు అంటుకుంటాయి అని సదరు షాప్ యజమానులు ఆందోళన చెందారు. అయితే రెస్టారెంట్ కింద ఉన్న బిగ్ సి మొబైల్ షాప్ లోకి మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చెయ్యగలిగారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)