అవినీతి ఆరోపణలతో పంజాబ్ మంత్రి తొలగింపు

Telugu Lo Computer
0


పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ సింగ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింఘ్లా ను  క్యాబినెట్ నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ కాంట్రాక్టులకు గాను అధికారుల నుంచి ఒక శాతం కమిషన్ అడుగుతున్నారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీంతో ప్రభుత్వం విచారణ జరిపింది. ఈ విచారణలో మంత్రి ఒక శాతం కమిషన్ అడిగినట్లు ఆధారాలు లభించాయి. ఆరోపణలు రుజువు కావడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ మంగళవారం సీఎం భగవంత్ మన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మంత్రిపై కేసు నమోదు చేయమని కూడా పోలీసులకు సూచించినట్లు సీఎం తెలిపారు. అవినీతి ఆరోపణలు వచ్చిన సొంత నేతలపై చర్యలు తీసుకునే దమ్ము, నిజాయితీ తమ పార్టీకి మాత్రమే ఉన్నాయని రాఘవ్ చద్దా అన్నారు. గతంలో ఇలాంటి నిర్ణయం ఢిల్లీలో తీసుకున్నామని, ఇప్పుడు పంజాబ్‌లో తీసుకున్నామని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తమ పార్టీ అవినీతిని సహించదని, ముఖ్యమంత్రి నిర్ణయం అభినందించదగ్గది అని ట్వీట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)