ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా గణపవరంలో ఈరోజు 'వైఎస్సాఆర్ రైతు భరోసా' నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. సీఎం ప్రసంగిస్తుండగా మధ్యలోనే మహిళలు లేచి వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణం ఖాళీగా మారింది. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా గణపవరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. దుకాణాలు, ఆస్పత్రులు మూయించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రికి వెళుతుండగా పోలీసులు ఆపారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన మహిళలు
May 16, 2022
0
Tags