చార్మినార్‌లో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు షాప్‌ మొత్తం వ్యాపించడంతో దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంఇ సమాచారం అందించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరకుని  ఫైర్‌ ఇంజన్‌ సాయంతో దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. షాట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, కానీ ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)