మంటగలిసిన మానవ సంబంధాలు !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌కు చెందిన బబ్లీ, ఇంద్రరామ్‌ భార్యాభర్తలు. ఇంద్రరామ్‌ ఆమెకు రెండో భర్త. వీరిద్దరు 11 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, బబ్లీకి మొదటి భర్త వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. అనంతరం మొదటి భర్త వదిలేయడంతో ఇంద్రరామ్‌ను బబ్లీ రెండో పెండ్లి చేసుకుంది.అయితే ఇంద్రరామ్‌, బబ్లీ సంసారం సజావుగా సాగుతున్న క్రమంలో మొదటి భర్తతో కలిగిన పెద్ద కొడుకు వారి ఇంటికి రావడం మొదలు పెట్టాడు. కొంత కాలంగా అతడు తన తల్లి దగ్గరకు వస్తూ పోతూ ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారి వ్యవహారంపై తనకు మొదటి నుంచి అనుమానం ఉందని, ఇద్దరు పెండ్లి చేసుకున్నారని ఇంద్రరామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిద్దరు ఇంట్లో నుంచి రూ.20 వేలు ఎత్తుకుని పోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)