మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతం, తిల్యాఖేదీలో దినేశ్ మాలి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన పని నుంచి ఇంటికి తిరిగి రాగానే భార్య యశోదను ఇంకా వంట కాలేదా? అని అడిగాడు. అయితే, తాను ఇంకా వంట చేయలేదని, కొంత సమయం పడుతుందని సమాధానమిచ్చింది. ఈ సమాధానంతో ఆగ్రహంతో ఊగిపోయిన దినేశ్ మాలి భార్యను చితకబాదాడు. ఇంతలో కుమార్తె నిఖిత అడ్డురాగా ఆమెను కూడా చావబాదాడు. భార్యను కొట్టిన దెబ్బలకు ఆమె కిందపడిపోయింది. అప్పటికీ అతని ఆగ్రహం చల్లారకపోవడంతో ఆమెను పక్కనే ఉన్న బావిలో నెట్టేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని కుమార్తె నిఖిత తన బంధువులకు తెలియజేసింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని బావిలో ఉన్న యశోద మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దినేష్ మాలిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
భార్యను కొట్టి బావిలో తోసిన భర్త !
May 26, 2022
0