ట్రైనీతో పైలట్‌ శృంగారం !

Telugu Lo Computer
0


రష్యాలోని సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో విమానం ఎగురుతుండగా ట్రైనీ మహిళతో పైలట్‌ శృంగారం జరిపాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. 28 ఏండ్ల పైలట్‌ కొందరు ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నాడు. రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 విమానంలో ఒక మహిళా ట్రైనీకి శిక్షణ ఇస్తూ ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో ఆమెను లోబరుచుకున్నాడు. విమానాన్ని ఆటో పైలట్‌ మోడ్‌లో ఉంచి ఆ మహిళతో శృంగారం జరిపాడు. దీనిని మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేశాడు. అక్కడ శిక్షణ పొందుతున్న ఒక విద్యార్థి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యింది. దీంతో శిక్షణ ఇచ్చే పైలట్‌తోపాటు మహిళా ట్రైనీని ఆ ఫ్లైట్‌ స్కూల్‌ తొలగించింది. అయితే ఈ వీడియో వైరల్‌ కాకముందే ఆ మహిళ రిజైన్‌ చేసినట్లు వార్తలొచ్చాయి. అలాగే ఆ పైలట్ వివాహితుడు కావడంతో శృంగారాన్ని రికార్డు చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఎక్స్‌ట్రా క్లాసులు చెబుతానని ఆ పైలట్‌ హామీ ఇవ్వడంతో దానికి ఆమె ఒప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)