అసోం కేడర్ ఐఏఎస్ అధికారి జల్లి కీర్తి, వరదల్లో సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కీర్తి వరంగల్‌లో పుట్టి, పెరిగారు. అసోం కచార్ డిప్యూటీ కమిషనర్‌గా సేవలు అందిస్తున్నారు. వారం రోజులుగా అసోంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో రహదారులు, రోడ్లు, భవనాలు ఇలా అన్నింటిపై ప్రభావం చూపాయి. సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారికి కీర్తి జల్లి అండగా నిలిచారు. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా మోకాల్లోతు బురదలో నడుస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు. అక్కడి ప్రజలను అక్కున చేర్చుకోవడాన్ని చూసి యావత్ సోషల్ మీడియానే ప్రశంసలు కురిపిస్తోంది. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఆమె అనుసరిస్తున్న విధానం చూసి తోటి ఐఏఎస్‌లు అభినందిస్తున్నారు. కీర్తికి వృత్తిపై ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న మమకారానికి అంతా ఫిదా అవుతున్నారు.
తెలుగు బిడ్డ సేవలకు అసోం ఫిదా !
May 28, 2022
0
Tags