వెస్ట్ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా మొహిందర్ కె.మిదా

Telugu Lo Computer
0


భారత సంతతికి చెందిన  మొహిందర్ కె.మిదా వెస్ట్ లండన్‌లోని, ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమె బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు. మిదా ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి మహిళ మాత్రమే కాకుండా, బ్రిటన్‌లో ఈ పదవి చేపట్టిన తొలి దళిత మహిళ కూడా కావడం విశేషం. మిదా ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారు. మిదా ఎన్నికపై బ్రిటన్‌లోని ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్ అండ్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ (ఫ్యాబో) హర్షం వ్యక్తం చేసింది. బ్రిటన్‌లో ఫ్యాబో సంస్థ దళిత హక్కులపై పోరాడుతుంది. మిదా ఈ నెల 5న జరిగిన ఎన్నికలో డోర్మర్స్ వెల్స్ వార్డ్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు కూడా ఆమె అదే స్థానం నుంచి గెలుపొందారు. మిదా మేయర్‌గా ఎన్నిక కావడంపై లేబర్ పార్టీ కూడా సంతోషం వ్యక్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)