పిల్లల ముందే తల్లి హత్య !

Telugu Lo Computer
0

ఢిల్లీలో ఒక మహిళను వెంబడించిన దుండగుడు కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. గురువారం మధ్యాహ్నం సౌత్ వెస్ట్ ఢిల్లీలో ఆరతి అనే 24 ఏళ్ళ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళుతండగా ఒక దుండగుడు ఆమె పై దాడి చేసి చంపబోయాడు. దీంతో ఆ మహిళ ప్రాణాలు దక్కించుకునేందుకు పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యింది. దుండగుడు మహిళను వెంబడించి ఆమెను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసాడు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ లో రికార్డై ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహిళను పొడిచినట్లు సాగర్ పూర్ పోలీసు స్టేషన్ కు సమాచారం వచ్చింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో దుండగుడు బాధితురాలికి ఇంతకు ముందు తెలిసినవాడే అని తేలింది. గతంలో ఇరుగుపొరుగున నివసించే వారని ఆమె ఇప్పుడు ఇల్లు మారిందని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)