తమిళనాడులోని చంగల్పట్టు జిల్లా చెయ్యూరులో గిరీశ్ కుమార్, కీర్తన జంట వివాహ వేడుక జరిగింది. ఈ నూతన వధువరులతో కలిసి ఫొటో దిగేందుకు వేదికపై వచ్చిన స్నేహితులు ఒక్కసారిగా ఒక కవర్లో నుంచి రెండు బాటిళ్లు బయటకు తీశారు. ఆ బాటిళ్లు పెట్రోల్, డీజిల్‌తో నింపి ఉన్నాయి. ఆ బాటిళ్లను జంట చేతిలో పెట్టి సర్ప్రైజ్ చేశారు. గతంలోనూ వివాహ వేడుకలో పెళ్లైన జంటకు పెట్రోల్ డబ్బాతోపాటు ఉలిగడ్డలు, సిలిండర్ ధరలు పెరిగినప్పుడు ఇలానే బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. దేశంలో నిత్యావసర ధరలు పెరిగినప్పుడల్లా వాటి విలువ ఎంత పెరిగిపోయిందో గుర్తుచేసేందుకు చాలామంది ఇలాంటి వినూత్న ప్రయత్నాలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొత్తగా పెళ్లైన జంటకు పెట్రోల్, డీజిల్ గిఫ్ట్ !
April 08, 2022
0
Tags