విగ్గులో బంగారం..!

Telugu Lo Computer
0


సినిమాను తలపించే విధంగా విగ్గులో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్న ప్రయాణీకుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న ప్రయాణీకుడిని అనుమానించిన అధికారులు అతని సామాగ్రిని తనిఖీ చేశారు. వాటిల్లో ఏమీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి మరిన్ని అవసరమైన పరీక్షలు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. ఆ ప్రయాణీకుడు బంగారాన్ని పేస్ట్‌గా చేసి.. అందులో కొంతభాగాన్ని తల విగ్గులో.. మరికొంతభాగాన్ని తన పురీషనాళంలో దాచి పెట్టాడు. అతడి స్మగ్లింగ్‌ శైలిని చూసి.. అధికారులు ఆశ్చర్యపోయారు. రూ.30 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)