లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

Telugu Lo Computer
0


ఢిల్లీలోని శక్తి నగర్ ప్రాంతంలోని గ్రీన్ లాంజ్ ఫ్యాషన్ మ్యారేజ్ హాల్‌లో గురువారం రాత్రి ఒక వివాహం సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగింది. అర్థరాత్రి 12.45 గంటలకు ఈ ప్రమాదం గురించి ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్‌ వైర్లు కాలిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో వివాహానికి వచ్చిన అతిథుల్లో నలుగురు వ్యక్తులు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు 65 ఏండ్లకుపైబడిన వృద్ధులు. ఒక మహిళ కూడా లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిలో ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. లిఫ్ట్‌లో వృద్ధులు ఉండటంతో వారు ఆందోళన చెందకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. లిఫ్ట్‌ పై భాగాన్ని కట్‌ చేసి అగ్నిమాపక సిబ్బంది ఆ లిఫ్ట్‌లోకి దిగి అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)