ఎలుకలు కొరికిన బాధితుడు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్​ను వరంగల్ నుంచి హైదరాబాద్​కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సహకరించక పోవడంతో శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతతో మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, భర్త మృతితో రోడ్డునపడ్డామని మృతుడి భార్య జ్యోతి కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని శ్రీనివాస్​ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)