పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న జనాలకు మరో షాక్ తగిలింది. సబ్బుల ధరలను పెంచుతూ హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా దిగుమతులపై ప్రభావం పడటంతో సబ్బుల తయారీ కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో సబ్బుల ధరలను 3 నుంచి 7 శాతం మేరకు హెచ్‌యూఎల్ పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్, పియర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా వంటి ఒంటి సబ్బుల ధరలు కూడా పెరగనున్నాయి. సర్ఫ్ ఎక్సల్ డిటర్జెంట్ కేజీ రూ.130 నుంచి రూ.134కు పెరిగింది. లక్స్ సోప్ (100 గ్రాములు 4) ఏకంగా 6.66 శాతం పెరిగి రూ.160కి చేరింది. పియర్స్ (75 గ్రాములు 3) సబ్బుల ధర సైతం 5.4 శాతం పెరిగి రూ.135కి చేరింది.
సర్ఫ్, సబ్బుల ధరల పెంపు !
April 01, 2022
0
Tags