రూ.5 లక్షలకే ఎంబీబీఎస్‌ సీటు ?

Telugu Lo Computer
0


రూ. 5 లక్షలకే ఎంబిబిఎస్‌ సీటు పేరుతో వైస్‌ మాగ్నెట్ కన్సల్టెన్సీ మోసానికి పాల్పడినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. పార్లమెంటు సభ్యుల కోటాలో కూడా ఎంబిబిఎస్‌ సీట్లు ఇప్పిస్తామంటూ సోషల్‌మీడియాలో ప్రచారం నిర్వహిస్తోందని అన్నారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో గల ఓ భవనంలో ఏర్పాటు చేసిన వైస్‌ మాగ్నెట్ కన్సల్టెన్సీ పేరుతో సచిన్‌ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సీట్లు కావాలంటూ కన్సల్టెన్సీకి వస్తున్న వారి వివరాలను తీసుకుని వారి నుండి లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్నాడని వెల్లడించారు. వసూలు చేసిన నగదుతో పరారైనట్లు వివరించారు. అయితే ఎంతమంది బాధితులు ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నారు కానీ ఇప్పటివరకు నిందితుడిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ముగ్గురు బాధితులు ఫిర్యాదు చేయగా.. రెండు కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. సచిన్‌ రెండు నెలల్లో 60 మందిని మోసం చేశాడని, హైదరాబాద్‌, బెంగళూరు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)