రష్యా ఆక్రమణదాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ షాకిచ్చింది. ఓవైపు రష్యాతో చర్చల కోసం బెలారుస్‌కు బృందాన్ని పంపిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అదే చేత్తో తమను ప్రత్యేక ఎంపిక విధానం ద్వారా యూరోపియన్ యూనియన్‌లోకి తక్షణమే చేర్చుకోవాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ అప్లికేషన్‌పై తాను స్వయంగా సంతకం చేయడంతోపాటు మరో ఇద్దరితో సంతకం చేయించి మరీ పంపాడు జెలెన్స్కీ. ఓవైపు చర్చలంటూనే రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈయూ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవడం వల్ల సహజంగానే చర్చల్లో అడుగు ముందుకు పడలేదు. బెలారుస్ బోర్డర్‌లో జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయి. ఉక్రెయిన్ దరఖాస్తును ఈయూ దేశాలు పరిశీలించాయి. నిజానికి ఈయూలో ఏ దేశమైనా చేరాలంటే సుదీర్ఘ కాలంపాటు సాగే చాలా లెంగ్తీ ప్రాసెస్ వుంటుంది. ఓరకంగా చెప్పాలంటే చాలా సంక్లిష్టమైన విధానాన్ని అనుసరించడం ద్వారానే ఏ దేశానికైనా ఈయూ సభ్యత్వం ఇస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న దేశానికి సంబంధించి మూడంశాలను పరిశీలిస్తారు. రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్య స్థితిగతుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న దేశం అప్లికేషన్‌ను పరిశీలించాల్సి వుంటుందా లేదా అన్నది తేలుస్తారు. ఆ మూడు అర్హతలు ఓకే అయితేనే ఈయూ దేశాలన్నీంటికీ అప్లికేషన్ వెళుతుంది. ఆ తర్వాత సుదీర్ఘ కాలంపాటు చర్చలు, సమాలోచనలు కొనసాగించిన తర్వాతనే ఆ దేశానికి సభ్యత్వం ఇవ్వాలా ? వద్దా? అన్నది తేలుస్తారు. అప్లై చేసుకున్న దేశానికి ఉన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అర్హతలను ఈయూ సభ్యదేశాలన్నీ పరిశీలిస్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తమ సార్వభౌమాధికారానికి ముప్పు పొంచి వుందంటూ ప్రత్యేక ఎంపిక విధానం ద్వారా ఈయూలో తమ దేశానికి సభ్యత్వం కల్పించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు అప్లికేషన్ సమర్పించారు. అయితే.. కేవలం 24 గంటల్లోనే మెజారిటీ ఈయూ దేశాలు ఉక్రెయిన్ ప్రయత్నాలకు మోకాలడ్డాయి. 27 దేశాలు ఉక్రెయిన్‌కు తక్షణమే ఈయూ సభ్యత్వం కల్పించాలన్న రిక్వెస్టును తోసిపుచ్చాయి. ఇందులో అర్జెన్సీ ఏమీ లేదని జర్మనీ, ఫ్రాన్స్ కుండబద్దలు కొట్టాయి. కేవలం 6 బాలిస్టిక్ దేశాలు మాత్రమే ఉక్రెయిన్‌కు అనుకూలంగా స్పందించాయి. రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్.. ఈయూ సభ్యత్వం లభిస్తే ఆ దేశాలన్నీ తమకు అండగా రంగంలోకి దిగుతాయని భావించింది. కానీ.. దరఖాస్తును వెంటనే పరిశీలించలేమంటూ.. దానికంత అర్జెన్సీ ఏమీ లేదంటూ మెజారిటీ ఈయూ దేశాలు తిరస్కరించాయి. దాంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి పెద్ద షాక్ తగిలినట్లయింది.
ఉక్రెయిన్‌కు షాకిచ్చిన యూరోపియన్ యూనియన్
March 01, 2022
0
Tags