ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వి.కోట దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బెనిఫిట్ షోకి వెళ్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. దీనికి ముందే వాళ్లు థియేటర్స్ దగ్గర బ్యానర్స్ కట్టారని తెలుస్తుంది. ఆ తర్వాత బెనిఫిట్ షోకు వెళ్తుంటే మార్గ మధ్యలో యాక్సిడెంట్ అయింది. దాంతో వాళ్లు అక్కడికక్కడే చనిపోయారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల సందర్భంగా అర్ధరాత్రి బెనిఫిట్ షో టికెట్ల కోసం వి.కోటకు వెళ్లారు. తమిళనాడు బోర్డర్‌లోని ఓ ఊరు నుంచి వీరు వచ్చారు. థియేటర్‌కు వస్తున్న సమయంలోనే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మృతులు రామకుప్పం, వీ. కోటకు చెందిన యువకులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు.
బెనిఫిట్ షోకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం
March 25, 2022
0
Tags