రష్యా వ్యాక్యూమ్ బాంబును ఉపయోగించింది?

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ పై దాడిలో రష్యా క్లస్టర్, వ్యాక్యూమ్ బాంబులను ఉపయోగించిందని అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా అన్నారు. ఈ చర్యను పలు అంతర్జాతీయ సంస్థలు ఖండించినట్టు తెలిపారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ' వారు వ్యాక్యూమ్ బాంబును ఉపయోగించారు. ఉక్రెయిన్ లో పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాలని అనుకుంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాక్ మాట్లాడుతూ.. ఆ వార్తలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. కానీ రష్యా అలాంటి ఆయుధాలు ఉపయోగించినట్టు ఇంకా నిర్దారణ కాలేదన్నారు. ఒక వేళ యుద్ధంలో వ్యాక్యూమ్ బాంబులను రష్యా ఉపయోగించిన విషయం నిజమే అయితే అది అతి పెద్ద యుద్ధ నేరం అవుతుందని ఆమె పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)