పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం నుంచి రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రం మార్చి11న థియేటర్లలోకి రానుంది. ఆద్యంతం అబ్బురపరిచే విజువల్స్‌తో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. 1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్
March 02, 2022
0
Tags