రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో హిందీ మార్కెట్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ ను క్రియేట్ చేశారు. బాహుబలి సెకండ్ పార్ట్ హిందీ వెర్షన్ కు ఫస్ట్ డే కలెక్షన్లు 41 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఇండియాలోని అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే ప్రభాస్ నటించిన సాహో సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రూ. 25 కోట్లు. ఈ స్థాయిని ఆర్ఆర్ఆర్ అందుకుంటుందా లేదా అనే ఆసక్తిలో నార్త్ ఇండియా ట్రేడ్ వర్గాలు విపరీతమైన ఆసక్తిని చూపించారు. ఈ క్రమంలో బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ వెర్షన్ కు గ్రాస్ అమౌంట్ 19 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ కలెక్షన్లు ఈ నంబర్ కన్నా ఇంకా తక్కువే ఉంటాయని పేర్కొంటున్నారు. రూ. 19 కోట్ల వ్యాల్యూ కేవలం అంచనా వేసిన అమౌంట్ అని తెలిపారు. రాజమౌళి మెగా ఎపిక్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ స్థాయిని సాహో మూవీని చేరుకోలేకపోయింది. మరి వీకెండ్స్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. అలాగే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వసూళ్లు చేస్తుందని అంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే హిట్ పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది కనుక ఈ సినిమా వీకెండ్స్ లో తన హవా చాటుతుందని అంటున్నారు. ఇక టాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లోనూ ఈ సినిమా భారీగా దూసుకుపోతుంది.
కలెక్షన్లతో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్.
March 26, 2022
0
Tags